వార్తలకు తిరిగి వెళ్లండి
పైపులైన్ లీకేజీ..వృథాగా తాగునీరు

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పాత కోర్టు లైన్‌లో కొన్ని రోజులుగా పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. రక్షిత మంచినీటి పథకం పనుల కోసం ఇటీవల తవ్విన గోతుల్లో పైపులైన్ దెబ్బతినడంతో ఈ సమస్య ఏర్పడింది.
మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి, నీటి వృథాను నివారించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
