Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలకు వెళ్లి విద్యార్థి అదృశ్యం

Anuroop Nov 10, 2026 2:38 PM నెల్లూరుGeneral
Add as a preferred source on Google
పాఠశాలకు వెళ్లి విద్యార్థి అదృశ్యం - Ushodayam
ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీకి చెందిన ఏడో తరగతి విద్యార్థి పల్లపు దిలీప్ కనిపించకుండా పోయాడు. సోమవారం పాఠశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సీతారామపురం మండలం అయ్యవారిపల్లి హైస్కూల్‌లో దిలీప్ చదువుతున్నాడు. పాఠశాలకు రాలేదని సమాచారం అందడంతో తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చేపట్టారు. బాలుడి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...