వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం పట్టణంలో తాగునీటి సరఫరా పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ తెలిపారు. నాగావళి వరద ఉద్ధృతికి ఇన్ఫిల్టర్ బావులు మునిగి, మోటార్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు.
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టామని, రాత్రి రెండో బావి మోటార్ ట్రిప్ కావడంతో కొంత అంతరాయం ఏర్పడినా ప్రస్తుతం బెలగాం, జగన్నాథపురం ట్యాంకులను నింపుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

