Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ

Anuroop Nov 10, 2026 11:01 AM పార్వతీపురం మన్యంGeneral
Add as a preferred source on Google
పాలకొండ ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ - Ushodayam
పాలకొండ మండల పరిషత్ అధ్యక్ష పదవిని జనరల్ మహిళకు కేటాయించగా, కూటమి పొత్తుల్లో భాగంగా ఈ పదవి టీడీపీకి దక్కింది. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 11 స్థానాలు గెలుచుకుంది. వీటిలో టీడీపీ ఏడు, జనసేన నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. టీడీపీ నేత కర్నేన అప్పలనాయుడు సతీమణి యోగిత, కుమార్తె పద్మ ప్రియదర్శిని విజయం సాధించారు. ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Comments

G
Loading comments...