వార్తలకు తిరిగి వెళ్లండి
పాడేరు మార్కెట్‌లో రూ.35కే ఉల్లి

ప్రభుత్వ ఆదేశాల మేరకు పాడేరు వ్యవసాయ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తున్నారు. ఈ నెల 9న నాలుగు టన్నుల ఉల్లిపాయల లోడ్ చేరడంతో పట్టణ ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చారు.
బయట మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతుండగా, ఇక్కడ రూ.35కే లభిస్తుండటంతో కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు చేరుకుంటున్నారు.
Comments
Loading comments...
