వార్తలకు తిరిగి వెళ్లండి
న్యూయార్క్ పరేడ్‌లో సునీతా విలియమ్స్‌కు అరుదైన గౌరవం

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో నిర్వహించిన వెటరన్స్ డే పరేడ్‌కు ఆమె గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించారు. మాజీ సైనికుల సేవలు, త్యాగాలను స్మరించుకునే ఈ కార్యక్రమంలో సుమారు 20 వేల మంది పాల్గొన్నారు.
అమెరికా నౌకాదళంలో పనిచేసిన అనుభవం తనకు ప్రత్యేకమని, మాజీ సైనికులను గౌరవించే పరేడ్‌కు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని సునీత పేర్కొన్నారు.
Comments
Loading comments...
