వార్తలకు తిరిగి వెళ్లండి
‘SAANS–2026’ ప్రారంభం

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో న్యూమోనియా నివారణకు చేపట్టిన ‘SAANS–2026’ కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. పద్మావతి గురువారం ప్రారంభించారు.
ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యూమోనియా లక్షణాలను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని ఆమె సూచించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
