వార్తలకు తిరిగి వెళ్లండి
బాసర వెళ్లేవారికి అలర్ట్

మరమ్మతు పనుల కారణంగా నవీపేట్ మండల కేంద్రంలో బాసరకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేట్‌ను ఐదు రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు గేట్ పూర్తిగా మూసి ఉంటుందని ఉమ్రి సెక్షన్ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్ వెల్లడించారు.
దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగనున్నందున, బాసరకు వెళ్లే భక్తులు మరియు స్థానిక వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని సహకరించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...
