వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సీపట్నంలో రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

నర్సీపట్నం మండలం గబ్బాడకు చెందిన భాస్కర్ సాయి తండ్రి కన్నయ్య నాయుడు ప్రమాదవశాత్తు మరణించడంతో ఆయన భార్య రాజేశ్వరికి రూ.10 లక్షల బీమా పరిహారం మంజూరైంది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిరుమలకుమార్, అసిస్టెంట్ మేనేజర్ సందీప్ చొరవతో పరిహారం అందింది.
బుధవారం చెక్కును భాస్కర్ సాయికి అందజేశారు. ఎస్‌ఎస్‌టీ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పావని, నాగలక్ష్మి, భవాని సహకరించారు.
Comments
Loading comments...
