వార్తలకు తిరిగి వెళ్లండి
గోదాముల నిర్మాణంపై అభ్యంతరం

నెల్లూరు రూరల్ 25వ డివిజన్లోని డీఎస్కే గార్డెన్, యూకో నగర్లో కమర్షియల్ గోదాముల నిర్మాణాలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం రెసిడెన్షియల్ లేఔట్గా ఏర్పడిన ప్రాంతంలో ఇళ్ల మధ్య గోదాములు నిర్మిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
అనుమతులు లేకుండా నిర్మించవద్దని పలుమార్లు అధికారులను కోరినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
