వార్తలకు తిరిగి వెళ్లండి
నీటి కుంటలో మునిగి నలుగురు పిల్లలు మృతి

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో పొలంలోని నీటి కుంటలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. నీరు తీస్తుండగా పూజా నాయక్ (14) జారిపడగా, ఆమెను కాపాడేందుకు మరో ముగ్గురు కుంటలోకి దిగారు.
పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను ముకేష్ (21), నిర్మల్ (18), మనోజ్, పూజా (14)గా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...
