వార్తలకు తిరిగి వెళ్లండి
నడిమివలస మెట్ట వద్ద ఏనుగుల సంచారం

కొమరాడ మండలం నడిమివలస మెట్ట ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారులు బుధవారం ఉదయం తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గిరిజన రైతులు కొండపోడు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.
ఎలిఫెంట్ ట్రాకర్ల సూచనలు పాటించాలని, ఏనుగులు కనిపిస్తే వాటిని కవ్వించవద్దని హెచ్చరించారు. అలా చేస్తే ఏనుగులు ఎదురుదాడి చేసే ప్రమాదం ఉందని తెలిపారు.
Comments
Loading comments...
