Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్ల బాలుడి చికిత్సకు ఆపన్నహస్తం

Shruthi Nov 16, 2026 7:26 AM కరీంనగర్General
Add as a preferred source on Google
నాలుగేళ్ల బాలుడి చికిత్సకు ఆపన్నహస్తం - Ushodayam
పెద్దపల్లి జిల్లా జీడీనగర్‌కు చెందిన సంపంగి సాంబరాజు, మౌనిక దంపతుల నాలుగేళ్ల కుమారుడు అభినవ్‌ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుండె పనితీరు 15 శాతానికి పడిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో నిరుపేద తల్లిదండ్రులు దాతల సాయం కోరుతున్నారు.

Comments

G
Loading comments...