వార్తలకు తిరిగి వెళ్లండి
నాగులపల్లి తండాలో పనుల పరిశీలన

నాగులపల్లి తండాలో వీబీజీ రాంజీ పథకం కింద జరుగుతున్న పరంపండు పనులను ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సరిత, టెక్నికల్ అసిస్టెంట్ మల్లికార్జున్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను తనిఖీ చేసి కొలతలు తీసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనలు, నిర్ణీత కొలతలకు అనుగుణంగా నాణ్యత తగ్గకుండా పనులు చేపట్టాలని కూలీలకు సూచించారు. ఈ పరిశీలనలో వీబీజీ రాంజీ కూలీలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
