Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులదిన్నె పాఠశాలను తనిఖీ చేసిన MEO

Anuroop Nov 10, 2026 4:18 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
నాగులదిన్నె పాఠశాలను తనిఖీ చేసిన MEO - Ushodayam
నందవరం ఎంఈవో రఘునాథ్ మంగళవారం నాగులదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు ఎస్ఏ-1 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన, నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...