Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్‌లో వెలమ సంఘం సమావేశాలు

Harika Nov 09, 2026 4:09 PM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
నాగర్‌కర్నూల్‌లో వెలమ సంఘం సమావేశాలు - Ushodayam
నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఆలిండియా వెలమ సంఘం కార్యవర్గ సభ్యులు జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సంఘం ఈసీ సభ్యుడు కోట్ల నరేందర్ రావు సోమవారం వంగూరు మండలం కోనేటిపూరులో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కొల్లాపూర్‌లో, మధ్యాహ్నం 12 గంటలకు నాగర్‌కర్నూల్‌లో, 2 గంటలకు అచ్చంపేటలో సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. వెలమ సంఘం సభ్యులు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...