వార్తలకు తిరిగి వెళ్లండి
నాగనందపురంలో ప్రమాదకరంగా మంచినీటి ట్యాంకు

వరదయ్యపాలెం మండలం నాగనందపురంలో రక్షిత మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పైకప్పు పెచ్చులు ఊడిపడి తాగునీటిలో పడుతుండటంతో నీటి నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ట్యాంకు నిండిన తర్వాత బయటకు వెళ్లే నీటికి పైపు లేకపోవడంతో పక్కనే ఉన్న పాఠశాల ఆవరణలోకి చేరుతోంది. దీంతో విద్యార్థుల ఆటస్థలానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Comments
Loading comments...
