వార్తలకు తిరిగి వెళ్లండి
ముంపు సమస్యపై వాకలపూడిలో ధర్నా

వాకలపూడి వినాయక రామకృష్ణ నగర్‌లో ముంపు సమస్య పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు ధర్నా చేశారు. 150 ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని, పది రోజులుగా ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
13 రహదారులు నీటమునిగాయని, ఇళ్లలోకి పాములు వస్తున్నాయని తెలిపారు. ముంపు నీటిని తొలగించి శాశ్వత డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
