Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదిన వేడుకల్లో ఘనంగా ఆశీర్వాద దీపోత్సవం

Follow Ushodayam on Google
H M G H Q Sep 17, 2026 9:55 PM కర్నూలుGeneral
మోదీ జన్మదిన వేడుకల్లో ఘనంగా ఆశీర్వాద దీపోత్సవం - Ushodayam
పత్తికొండ మండలం హోసూరులో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపోత్సవం నిర్వహించారు. టీడీపీ ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి హోసూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ మోదీ 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో సేవలందించడం గర్వకారణమన్నారు. సుపరిపాలన, పేదల సంక్షేమం, దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. గోవర్ధన్ నాయుడు, కర్ణం నరేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...