వార్తలకు తిరిగి వెళ్లండి
మంగలివాని డ్రైన్‌లో గుర్రపు డెక్క తొలగించాలి

మోపిదేవి మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని అన్నవరం వద్ద మంగలివాని సింక్ డ్రైన్‌లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఖరీఫ్‌లో వర్షాలకు డ్రైన్ పొంగి పంట పొలాలు మునిగిపోతున్నాయని తెలిపారు.
సుమారు 1,500 ఎకరాల పొలాల మురుగునీరు ఈ డ్రైన్ ద్వారానే కృష్ణా నదిలో కలుస్తుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి గుర్రపు డెక్కను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
