వార్తలకు తిరిగి వెళ్లండి
మల్లయ్యకొండకు పోటెత్తిన భక్తులు

తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయమే అర్చకులు మల్లికార్జున, ఈశ్వరప్ప స్వామి, అమ్మవారికి అలంకరణ చేసి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తుల పేరిట పూజలు, అర్చనలు చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...
