వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా జైలులో న్యాయ సేవా విజ్ఞాన దినోత్సవం

చట్టాలపై అవగాహన ఖైదీల పునరావాసానికి తొలి మెట్టని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ యూసఫ్ అన్నారు. నర్సంపేట మహిళా ప్రత్యేక కారాగారంలో జైలు సూపరింటెండెంట్ స్రవంతి అధ్యక్షతన న్యాయ సేవా విజ్ఞాన దినోత్సవం నిర్వహించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఖైదీలు గతాన్ని విడనాడి, సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవంగా జీవించాలని సూచించారు.
Comments
Loading comments...
