వార్తలకు తిరిగి వెళ్లండి
మహాపాదయాత్ర విజయవంతానికి బీజేపీ పిలుపు

ఈ నెల 18న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ కోరారు. బుధవారం చొప్పదండి రూరల్ మండల అధ్యక్షుడు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాపాదయాత్రకు సంబంధించిన వివరాలను నాయకులు, కార్యకర్తలకు వివరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...
