వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్రో పట్టాలపైకి వ్యక్తి.. రైళ్లకు అంతరాయం

విజయనగర స్టేషన్‌లో ఓ వ్యక్తి పట్టాలపైకి దిగడంతో మంగళవారం మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రతా సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపి అతడిని ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు. 1.58 గంటలకు రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఆ వ్యక్తి పట్టాలపైకి ఎందుకు దిగాడో పోలీసులు విచారిస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం గాజు ఫలకాల వ్యవస్థ ఏర్పాటును నమ్మ మెట్రో పరిశీలిస్తోంది.
Comments
Loading comments...
