Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోడకు కన్నమేసి ఆభరణాల అపహరణ

Sai Nath Nov 10, 2026 2:40 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
గోడకు కన్నమేసి ఆభరణాల అపహరణ - Ushodayam
మేడ్చల్‌లోని శ్రీజగదాంబ జ్యువెలరీ షాపులో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఉన్న దుకాణం వెనుక గది గోడకు కన్నం వేసి లోపలికి చొరబడి విలువైన ఆభరణాలు, వస్తువులను అపహరించారు. మంగళవారం ఉదయం షాపు తెరిచిన యజమాని కుమారుడు అజయ్‌ చౌదరి చోరీని గుర్తించారు. యజమాని శేషమాల్‌ చౌదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించారు. ఇదే దుకాణంలో గతంలోనూ చోరీ జరిగినట్లు సమాచారం.

Comments

G
Loading comments...