వార్తలకు తిరిగి వెళ్లండి
మాలకొండ ఘాట్ రోడ్‌లో ట్రాలీ ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఘాట్ రోడ్‌లో ట్రాలీ ఆటో బోల్తా పడింది. కడప జిల్లా మైదుకూరు మండలం ముసల్నాయుని పల్లెకు చెందిన 35 మంది భక్తులతో వెళ్తున్న వాహనం నాలుగో మలుపు వద్ద అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Loading comments...
