వార్తలకు తిరిగి వెళ్లండి
లోక్ అదాలత్ విజయవంతానికి జడ్జి పిలుపు

డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని రామచంద్రపురం 13వ అదనపు జిల్లా జడ్జి బి.హెచ్.వి. లక్ష్మీకుమారి కోరారు. మంగళవారం కోర్టు హాలులో న్యాయవాదులతో సమావేశమై ఈ మేరకు సూచనలు చేశారు.
రాజీకి అవకాశమున్న కేసుల్లో సహకరించాలని, లోక్ అదాలత్ ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి నిజాం శారద, జడ్జి ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...
