వార్తలకు తిరిగి వెళ్లండి
ఫ్రిడ్జ్ పేలి అగ్నిప్రమాదం

లక్షెట్టిపేట పట్టణంలోని సీఐఎస్‌ఐ కాంపౌండ్‌లో బుధవారం ఫ్రిడ్జ్ పేలడంతో మంటలు వ్యాపించాయి. వార్డెన్ థామస్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
Comments
Loading comments...
