వార్తలకు తిరిగి వెళ్లండి
లింగాలలో రీ సర్వే పనుల పరిశీలన

పలగూడెం మండలం లింగాల గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను తిరువూరు ఆర్డీవో ఏ.కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు తమ భూముల వద్ద ఉండి సర్వే సిబ్బందికి హద్దులు చూపించాలని సూచించారు.
రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
