Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలలో ఇంకుడు గుంతల పనులు ప్రారంభం

Anuroop Nov 10, 2026 6:32 PM ములుగు General
Add as a preferred source on Google
లింగాలలో ఇంకుడు గుంతల పనులు ప్రారంభం - Ushodayam
లింగాల గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఒక్కరోజే 25 ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో గుంతలకు ముగ్గు పోసి పనులు చేపట్టారు. భూగర్భ జలాలను పెంచేందుకు వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకించడంలో ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...