వార్తలకు తిరిగి వెళ్లండి
లింగాలఘనపురం మోడల్ స్కూల్లో టాలెంట్ టెస్ట్

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లింగాలఘనపురం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి. సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
