వార్తలకు తిరిగి వెళ్లండి
లారీ డ్రైవర్ కుమారుడికి జాతీయ జట్టు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన చేబ్రోలు చెన్నకేశవ జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. లారీ డ్రైవర్ శివకృష్ణ కుమారుడైన అతను ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ప్రతిభతో తెలంగాణ అండర్-19 రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడు.
డిసెంబరు 10న అండమాన్ నికోబార్‌లో జరిగే జాతీయ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడనున్నాడు.
Comments
Loading comments...
