వార్తలకు తిరిగి వెళ్లండి
లారీ బోల్తా.. దూకి ప్రాణాలు కాపాడుకున్న సిబ్బంది

తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామ శివారులో గురువారం ఉదయం 8.40 గంటల సమయంలో గ్రావెల్ టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గోపవరం నుంచి తాళ్లపూడి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
లారీ బోల్తా పడే సమయంలో డ్రైవర్, క్లీనర్ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...
