వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మూడు కంపెనీలు దగ్ధం
హైదరాబాద్ కూకట్పల్లి ఆస్బెస్టాస్ కాలనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పేపర్ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న GRT నెయ్యి, హల్దీరామ్ గోడౌన్లకు వ్యాపించాయి. దీంతో మూడు కంపెనీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
అక్కడ పార్క్ చేసిన ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం కూడా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Comments
Loading comments...
