Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి భూముల వేలాన్ని అడ్డుకుంటాం: ఈటల

Sai Nath Nov 10, 2026 6:52 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
కూకట్‌పల్లి భూముల వేలాన్ని అడ్డుకుంటాం: ఈటల - Ushodayam
కూకట్‌పల్లిలో హౌసింగ్‌ బోర్డు భూముల వేలాన్ని స్థానికులతో కలిసి అడ్డుకుంటామని మల్కాజిగిరి భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. భూముల విక్రయాలను నిరసిస్తూ భాజపా నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. జనసాంద్రత అధికంగా ఉన్న కూకట్‌పల్లిలో పార్కులు, ఆటస్థలాలు, మౌలిక సదుపాయాల కోసం భూములు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా భూములను వేలం వేయడం సరికాదని ఈటల అన్నారు.

Comments

G
Loading comments...