వార్తలకు తిరిగి వెళ్లండి
కుక్కునూరు శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కార్తీకమాసం ప్రారంభం కావడంతో కుక్కునూరు మండలంలోని ప్రాచీన శివాలయాలకు భక్తులు పోటెత్తారు. రావిగూడెం కేదారేశ్వర స్వామి, మాధవరం కౌండిన్య ముక్తేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులు గోదావరిలో పాడ్యమి స్నానాలు ఆచరించారు.
ఆలయాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించగా, కుక్కునూరు శివాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
Comments
Loading comments...
