వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్‌లో దీపావళి సందడి

కుబీర్ మండలవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వ్యాపార సముదాయాల్లోనూ లక్ష్మీ పూజలు చేపట్టారు. సాయంత్రం చిన్నాపెద్దా తేడా లేకుండా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. దీపాల వెలుగులతో గ్రామాలు సందడిగా మారాయి.
Comments
Loading comments...
