వార్తలకు తిరిగి వెళ్లండి
కొయ్యూరులో భక్తిశ్రద్ధలతో నాగులచవితి

నాగులచవితి సందర్భంగా శుక్రవారం కొయ్యూరు మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొయ్యూరు, రాజేంద్రపాలెం, నడింపాలెం, శరభన్నపాలెం తదితర గ్రామాల్లో భక్తులు పొలాల్లోని పుట్టల వద్ద పాలు పోసి, నాగరాజుకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
పొలాల్లో పనిచేసే రైతులకు పాముల వల్ల ఎలాంటి హాని కలగకూడదని నాగేంద్రుడిని వేడుకున్నారు. మండలవ్యాప్తంగా పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Comments
Loading comments...
