వార్తలకు తిరిగి వెళ్లండి
కొయ్యూరు ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ

కొయ్యూరు ఎంపీపీ పదవి మహిళకు కేటాయించడంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి 9 స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించింది.
ఎంపీపీ రేసులో కొయ్యూరు ఎంపీటీసీ సభ్యురాలు మాకాడ సీత, పెదమాకవరం సభ్యురాలు దుచ్చరి గౌరీ సత్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని పదవి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...
