వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్తూర్ సిలిండర్ల పరిశ్రమలో తనిఖీలు

స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో కొత్తూర్‌లోని కర్నూలు సిలిండర్స్ పరిశ్రమను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. పెయింటింగ్ పనుల వల్ల పరిసర ప్రాంతాల్లో పొగ, దుర్వాసన వెలువడుతున్నట్లు గుర్తించారు.
తనిఖీ సమయంలో గ్యాస్ తొలగింపు వ్యవస్థ పనిచేయకపోవడాన్ని నివేదికలో పేర్కొన్నారు. పరిశ్రమపై తదుపరి పరిశీలనలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
