Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటప్పకొండ ఆలయ హుండీలకు రూ.58.47 లక్షలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:52 PM పల్నాడు General
కోటప్పకొండ ఆలయ హుండీలకు రూ.58.47 లక్షలు - Ushodayam
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలోని 19 హుండీలను లెక్కించగా రూ.58,47,871 ఆదాయం సమకూరింది. 102 రోజుల కాలానికి ఈ కానుకలు వచ్చినట్లు ఆలయ ఈవో డి. చంద్రశేఖర్ తెలిపారు. సాధారణ హుండీల ద్వారా రూ.52,33,337, అన్నదానం హుండీల ద్వారా రూ.6,14,534 లభించాయి. వీటితో పాటు 15 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారు.

Comments

G
Loading comments...