వార్తలకు తిరిగి వెళ్లండి
కోస్తాంధ్రలో అతి తీవ్ర తుపాను ముప్పు

ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 17న తీవ్ర తుపానుగా, 18న అతి తీవ్ర తుపానుగా మారవచ్చని అంచనా వేశారు. దీని ప్రభావంతో 19న అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
అతి తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరంలోనే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు. ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...
