వార్తలకు తిరిగి వెళ్లండి
కొడాలిలో కోటి ఒత్తుల దీపోత్సవం

ఘంటసాల మండలం కొడాలి గ్రామంలోని శ్రీ జగదీశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాల్లో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి కోటి ఒత్తులతో దీపోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
శివలింగం ఆకారంలో ప్రత్యేక అలంకరణ చేసి, దాని చుట్టూ దీపాలు వెలిగించారు. దీపోత్సవంతో ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది.
Comments
Loading comments...
