వార్తలకు తిరిగి వెళ్లండి
ఖాటుశ్యామ్‌జీ ఆలయంలో 19 గంటలు దర్శనాలు బంద్

రాజస్థాన్‌లోని ప్రముఖ ఖాటుశ్యామ్‌జీ ఆలయంలో భక్తుల దర్శనాలను 19 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. నవంబర్ 11 రాత్రి 10 గంటల నుంచి నవంబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంటాయని తెలిపింది.
నవంబర్ 12న బాబాకు నిర్వహించే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...
