Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తిక మాసంలో ఆర్టీసీ ప్రత్యేక యాత్రలు

Shruthi Nov 16, 2026 6:42 AM వరంగల్General
Add as a preferred source on Google
కార్తిక మాసంలో ఆర్టీసీ ప్రత్యేక యాత్రలు - Ushodayam
కార్తిక మాసం సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆర్టీసీ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ఏర్పాటు చేశారు. పంచారామాలు, అరుణాచలం, శబరిమలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 30 మంది భక్తులు కలిసి బస్సు కోరినా ఏర్పాటు చేయనున్నారు. అరుణాచల యాత్రకు పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 ఛార్జీ నిర్ణయించారు. పంచారామాల యాత్రకు పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,500 టికెట్‌ ధరగా నిర్ణయించారు.

Comments

G
Loading comments...