వార్తలకు తిరిగి వెళ్లండి
కార్తీకమాసానికి ముందే చెరువు శుభ్రం చేయాలి

భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ కార్తీకమాస ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమగుండం చెరువు అపరిశుభ్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీరు కలుషితమై, చెత్తాచెదారం పేరుకుపోయింది.
కార్తీక దీపాలను చెరువులో వదలడం ఆనవాయితీగా వస్తున్నందున, ఉత్సవాలకు ముందే అధికారులు స్పందించి చెరువును పూర్తిగా శుభ్రం చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
