వార్తలకు తిరిగి వెళ్లండి
కాజ్వే కొట్టుకుపోయి పది గ్రామాలకు రాకపోకలు బంద్

భారీ వర్షాలు, మురుసు తుఫాను ప్రభావంతో గుండేటి వాగు ఉధృతికి కుక్కునూరు–బెస్తగూడెం కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలోని పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నల్లకుంట మీదుగా వెళ్లాల్సి రావడంతో 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాజ్వే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
