Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలి నిబంధనలతో పేదలకు నీటి కష్టాలు

Rudhira Nov 23, 2026 1:00 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
కొత్త నల్లా కనెక్షన్‌కు రెవెన్యూ శాఖ ఎన్‌వోసీ తప్పనిసరి చేయడంతో పేద బస్తీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని అంబేద్కర్ బస్తీవాసులు తొమ్మిది నెలలుగా కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్‌వోసీలు ఎక్కడి నుంచి తీసుకురావాలని వారు ప్రశ్నిస్తున్నారు. కొండపై నుంచి నీటిని మోసుకొస్తూ అవస్థలు పడుతున్నారు. నగరంలోని ఇతర బస్తీల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...