వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల జిల్లాలో పంటకోత ప్రయోగాల పరిశీలన

జగిత్యాల జిల్లాలో వరిపంట దిగుబడుల అంచనా కోసం నిర్వహిస్తున్న పంటకోత ప్రయోగాలను రాష్ట్ర గణాంక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి సత్యం ఆధ్వర్యంలో గణాంక అధికారి శ్రీనివాస్, ఉపగణాంక అధికారి పులి రాజు కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి, వెల్గటూర్ మండలం బిర్సాని, మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామాల్లో పర్యటించి పంటకోత ప్రయోగాల నిర్వహణ తీరును, దిగుబడి అంచనాను పరిశీలించారు.
Comments
Loading comments...
