వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల ఎమ్మెల్యేకు ఆహ్వానం

జగిత్యాలలో ఈనెల 16న బంజారా భవన్‌లో జరగనున్న జగదాంబ అమ్మవారి ఆలయ పూజా కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను బుధవారం బంజారాలు ఆహ్వానించారు. క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఆహ్వానపత్రిక అందజేశారు.
కార్యక్రమంలో బంజారా అభివృద్ధి కమిటీ జిల్లా అధ్యక్షుడు బుక్య నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మాలోత్ లచ్య నాయక్, ఉపాధ్యక్షుడు నగవత్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
